కెనడాలో భారత సంతతి బిల్డర్ కాల్చివేత

  • ఎడ్మంటన్ లో కాల్పుల కలకలం
  • ఇద్దరు అక్కడికక్కడే మృతి
  • తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
కెనడాలో భారత సంతతికి చెందిన ప్రముఖ బిల్డర్, ఎడ్మంటన్ లోని గురునానక్ సిక్కు ప్రార్థనామందిరం అధ్యక్షుడు బూటా సింగ్ గిల్ హత్యకు గురయ్యారు. సోమవారం నాడు దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గిల్ ప్రాణాలు విడిచారు. అల్బెర్టా ప్రావిన్స్ లోని ఓ భవన నిర్మాణ ప్రదేశం వద్ద ఈ ఘటన జరిగినట్టు ఎడ్మంటన్ పోలీసులు వెల్లడించారు. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకునేసరికి అక్కడ ముగ్గురు వ్యక్తులు రక్తపు మడుగులోపడి వున్నారు. వారిలో ఇద్దరు అప్పటికే మృతి చెంది ఉండగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఒకరిని బూటా సింగ్ గిల్ గా గుర్తించారు. ఆ ముగ్గురి మధ్య జరిగిన కాల్పుల్లోనే గిల్ మరణించి ఉంటాడని ఎడ్మంటన్ పోలీసులు భావిస్తున్నారు.

Boota Singh Gill
Shot Dead
Builder
Indian Origin
Edmonton
Canada

More Telugu News